![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.
ఏమైంది వల్లి.. ఎందుకు డల్ గా ఉంటున్నావని అన్నాడు. ఈ నాలుగు చీరల్లో ఏ చీర కట్టుకోవాలో తెలియడం లేదని శ్రీవల్లి అనగానే చందు ఒకచీర సెలెక్ట్ చేస్తాడు. అది బాగుందని చందు చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సెల్ఫీ దిగుతారు. ఆ తర్వాత రొమాంటిక్ గా వల్లి దగ్గరికి వస్తాడు చందు. అప్పుడే పెద్దోడా అని వేదవతి పిలవగానే చందు కంగారుగా వెళ్తాడు. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరోవైపు అమూల్యని కామాక్షి రెడీ చేస్తుంది. ఇక తనకి నగలు అన్నీ వేసి రెడీ చేసి పొగుడుతుంటే అమూల్య డల్ గా ఉంటుంది. అది చూసి కామాక్షికి డౌట్ వస్తుంది. ఏమైందే నీకు ఎందుకు ఇలా ఉన్నావ్.. ఏమైనా లవ్ స్టోరీలున్నాయా అని కామాక్షి అంటుంది. అప్పుడే వేదవతి వచ్చి.. తన మీద సీరియస్ అయి.. అమూల్యకి కంగారుగా ఉందని చెప్పి కవర్ చేస్తుంది. ఇక అమూల్యని రెడీ చేసాక దిష్టి తీస్తుంది వేదవతి. ఆ దిష్టి నీళ్ళని పడేయమని తిరుపతికి ఇస్తుంది వేదవతి. అతను లవ్ ఫెయిల్ అయిందని భాదలో వాటిని బయటకు తీసుకెళ్తాడు.
మరోవైపు భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి రెడీ అయి ఇంటి గేట్ దాకా వస్తారు. వారిని చూసుకోకుండా తిరుపతి దిష్టి నీళ్ళు పడబోస్తాడు. ఆ నీళ్ళు ఆనందరావు మీద పడి తెల్ల డ్రెస్ ఎర్రగా మారిపోతుంది. ఇక తిరుపతి మీద భాగ్యం సీరియస్ అవుతుంది. చూస్కోలేదని తిరుపతి సారీ చెప్పగానే ఇద్దరు లోపలికి వెళ్తారు. మరోవైపు నర్మద దగ్గరికి సాగర్ వస్తాడు. నర్మద మల్లెపూల వాసన కనిపెట్టి వచ్చారా అని అడుగుతుంది. నా చూపులు నీ వీపుకి గుచ్చుకున్నాయా అని సాగర్ అనగానే అదేం లేదు.. నువ్వు తెచ్చిన మల్లెపూల వాసనతో కనిపెట్టానని నర్మద అంటుంది. భార్య కోసం ఎవరైన స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొస్తారు.. నీకు ఈ మల్లెపూల ఫాంటసీ ఏంట్రా బాబు అని నర్మద అంటుంది. ఒక మల్లెచెట్టుకు రోజు గ్లాసెడు నీళ్ళు పోస్తే అది గుప్పెడు మల్లెపూలని ఇస్తుందని సాగర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |